అల్లూరి సీతారామరాజు జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి గారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. అరకు వ్యాలీ తుంగల్‌గూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలను వైయస్ జగన్ గారు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.