'ఇస్కో.. ఉస్కో' అనడమే పరువు తక్కువ పని

  ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం

అమరావతి: ఐదేళ్లలో చంద్రబాబు ఇసుక మొత్తం దోచేసి..ఇప్పుడు మా ప్రభుత్వంపై పిల్లి శాపాలు పెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక కొరత పేరుతో 'ఇస్కో.. ఉస్కో' అనడమే పరువు తక్కువ పని అని... దానికి చంద్రబాబు మద్దతు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు. పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజీని సమకూర్చడం దగ్గర నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్మాణం అన్నీ మీరే కాదా? అని ప్రశ్నించారు. మళ్లీ సపోర్ట్ స్టేట్ మెంట్ ఎందుకో అని అడిగారు. మీ గురించి ఎవరికి తెలియదనుకుంటున్నారని అన్నారు.

ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికి ఉండేది కాదని విజయసాయిరెడ్డి చెప్పారు. మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను కూడా చంద్రబాబు మాఫియా స్మగ్లింగ్ చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేదని అన్నారు. చేసిందంతా చేసి... వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పడు పిల్లి శాపాలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

 

Read Also: చిరస్మరణీయులు పొట్టి శ్రీరాములు

తాజా ఫోటోలు

Back to Top