చిరస్మరణీయులు పొట్టి శ్రీరాములు

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే రోజా
 

చిత్తూరు: రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా పేర్కొన్నారు.  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎంపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. గత అయిదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొట్టి శ్రీరాములును విస్మరించి అవతరణ వేడుకలు నిర్వహించకపోవడం భాదకరమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేతృత్వంలో మా ప్రభుత్వం ఇప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్‌ 1న అవతరణ వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని తెలిపారు.  

 

Read Also:రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

తాజా ఫోటోలు

Back to Top