పచ్చ కళ్లద్దాల వల్ల మీకు రాష్ట్ర‌ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) చంద్రబాబు గారి హయాంలో (2018-19) కంటే రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగులీనుతోంది. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేది. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

లోకేష్ బిత్త‌ర స‌వాళ్లు..
ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్ గారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top