కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు ఘోర అన్యాయం

కందుకూరులోని పొగాకు బోర్డ్ ని సందర్శించిన వైయస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ 

తూమాటి మాధవరావు, బుర్రా మధుసూదన్ యాదవ్, ఇతర నాయకులు. 

పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన 

వైయస్సార్సీపీ నేతలు.

కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ.. 

క్వింటాకు రూ.20 వేలు దోపిడీ

ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ నేతల తీవ్ర ఆగ్రహం.

కందుకూరు:పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ ఆదేశాల మేరకు.. కందుకూరులోని పొగాకు బోర్డు (వేలం కేంద్రం) వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ తదితర నేతలు ఈరోజు ఉదయం  నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు పొగాకు బేళ్లను పరిశీలించి, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 
ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే... 

బుర్రా మధుసూదన యాదవ్ (కందుకూరు వైయస్సార్సీపీ సమన్వయకర్త):
"సాగు ఖర్చు కూడా రాని దుస్థితి.. కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం"

వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... మార్కె ఫెడ్ ద్వారా రూ.250 కోట్లు కేటాయించి పొగాకు రైతులకు రూ.3,600 (కిలోకు) వరకు గిట్టుబాటు ధర అందించి ఆదుకున్నాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం రూ.3,000 కూడా ఇవ్వడం లేదు. సీజన్ ముగుస్తున్నా రైతులకు న్యాయం జరగలేదు.  పొగాకు సాగు ఖర్చు క్వింటాకు రూ.22 వేలు అవుతుంటే, ప్రభుత్వం కేవలం రూ.16 వేల ధర మాత్రమే ఇప్పిస్తూ రైతులను అప్పులపాలు చేస్తోంది.
రైతుల పక్షాన గతంలో ఆందోళనలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సీఎం చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశారు.

తూమాటి మాధవరావు (ఎమ్మెల్సీ):

చంద్రబాబు వస్తే కరువు రావడం ఖాయం.
వ్యాపారులతో కుమ్మక్కైన చంద్రబాబు

గతంలో వైయస్.జగన్ పాలనలో 2019-24  విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు ఎరువులు, విత్తనాలు అందిస్తూ అండగా నిలిచాం. 'వ్యవసాయం దండగ' అనే భావన ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ రాష్ట్రంలో కరువు తాండవించడం ఖాయం. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కిలో పొగాకు రూ.360 చొప్పున కొనుగోలు చేస్తుంటే.. మన రాష్ట్రంలో అడ్డగోలుగా సగం ధరలకే వ్యాపారస్తులు కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటూ రైతులకు ఘోర అన్యాయం చేస్తోంది.

కాకాని గోవర్ధన్ రెడ్డి (మాజీ మంత్రి):
"హింసాత్మక పాలన.. 
భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకే ఈ కుట్ర!

భారతదేశ చరిత్రలోనే ఇంత క్రూరంగా రైతులను హింసిస్తున్న ప్రభుత్వం చంద్రబాబుది మాత్రమే. వైయస్ జగన్ గారి హయాంలో క్వింటాకు రూ.36 వేల వరకు లభించిన ధర, నేడు రూ.15,900 కి పడిపోయింది. కర్ణాటకలో పొగాకు క్వింటా ధర రూ.36 వేలు ఉంటే.. ఆంధ్రాలో కంపెనీలతో లాలూచీ పడి క్వింటాకు రూ.10 వేల నుండి రూ.15 వేలు దోచుకుంటున్నారు. దీనివల్ల రైతు బ్యారన్ కి రూ.5 లక్షల పైగా నష్టపోతున్నారు. ఐదు పంటల పేర్లు కూడా చెప్పలేని లోకేష్ నేడు మంత్రిగా ఉన్నారు. పొగాకు కొనుగోళ్లలో కూడా తమకు కావాల్సిన వారికి రికమండేషన్లతో ఒక రేటు, సామాన్య రైతులకు మరో రేటు ఇస్తూ వివక్ష చూపిస్తున్నారు.
రైతుల నష్టాలపై నిరసనలు చేస్తుంటే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు పంటకు దూరమైతే.. ఆ భూములను రూ.99 పైసలకే తమ అనుకూల వర్గాలకు కట్టబెట్టాలనే కుట్ర ఇందులో దాగి ఉంది. రైతుల ఆగ్రహం అగ్నిగా మారకముందే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి.

Back to Top