ప్రతి కార్యకర్త జగన్ 2.0 సూపర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

వడ్డీ రఘురామ్ నాయుడు

 తాడేపల్లిగూడెం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య సమర్థవంతమైన అనుసంధాన వేదికగా జగన్ 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని తాడేపల్లిగూడెం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి వడ్డీ రఘురామ్ నాయుడు అన్నారు. స్థానిక వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామ్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య నిరంతర అనుసంధానం కల్పిస్తూ, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను వేగంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో జగన్ 2.0 సూపర్ యాప్‌ను రూపొందించారని తెలిపారు.

పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ, పోలీసు వేధింపులను కూడా ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త జగన్ 2.0 సూపర్ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమర్థవంతంగా వినియోగించాలని వడ్డీ రఘురామ్ నాయుడు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top