కంభం రోడ్డు ప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

నలుగురి మృతి బాధాకరం

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: కంభం పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకకు హాజరై ఆలయానికి వెళ్లిన వారు ఈ విధంగా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వివాహ వేడుకల ఆనందం నిండిన కుటుంబంలో ఇలాంటి పెను విషాదం నెలకొనడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీవ్రంగా గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Back to Top