ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పిద్దాం

 ఓటు హక్కును ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలి: ఉషాశ్రీ చరణ్ 

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే  ఉషాశ్రీ చరణ్ తెలిపారు. రొద్దం మండలంలోని సానిపల్లి, పెదమంతూరు, శేషాపురం గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా అవసరమైన పత్రాలు, వివరాలను సకాలంలో ధ్రువీకరించుకోవాలని కోరారు. ప్రజల ఓటు హక్కు పరిరక్షణే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమని పేర్కొన్న ఆమె, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top