ఏపీ చరిత్రలో అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  ఏపీ చరిత్రలో అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే టీడీపీలో కట్టప్పగా చెప్పుకునే యనమల పేరు వినిపిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ట్వీట్ చేశారు . ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర ఆయనిది. పైగా తానో పేద్ద మేధావినంటూ నీతి వచనాలు. ప్రజలు ఏనాడో మర్చిపోయారు ఈ నమ్మకద్రోహిని అంటూ ట్వీట్ చేశారు.

 ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించిన ముద్దాయి యనమల రామకృష్ణుడు. అందుకే తునిలో ఏ ఎన్నికలోను పార్టీని గెలిపించక పోయినా యనమలకు పదవులు కట్టబెట్టాడు బాబు. ఇలాంటి ప్రజా తిరస్కృతుల వల్లే పార్టీ భ్రష్టు పట్టిందని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటార‌ని మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top