అగ్రిగోల్డ్ దివాలా పాపం బాబుదే

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  అగ్రిగోల్డ్ దివాలా పాపం బాబుదేన‌ని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు . వేయి కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ రిసార్టుపై పచ్చ బాబుల కన్నుపడింది. పాల ఫ్యాక్టరీ కూడా పెట్టడంతో హెరిటేజ్ కు పోటీ అవుతుందని భావించారు. ఎల్లోమీడియా ద్వారా పెట్టుబడిదారుల్లో సందేహాలు రేకిత్తించి మొత్తం లాక్కోవాలని స్కెచ్ వేసాడు.

అర్హులంద‌రికీ ఇళ్ల ప‌ట్టాలు
పేదల ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని కోరుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ గారు అధికారులను ఆదేశించార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. అలాగే కొత్తగా అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బుచ్చన్న ఉత్తుత్తి రాజీనామా వార్తలు బ్రేకులు..
చిట్టి నాయుడి ‘శవా’న్వేషణ యాత్రలకు బుచ్చన్న ఉత్తుత్తి రాజీనామా వార్తలు బ్రేకులు వేశాయి. ఎల్లో మీడియా లైవ్ కవరేజిలతో మైలేజి వచ్చిందని భ్రమపడ్డాడు. కానీ బుచ్చయ్య టైం చూసి కొట్టిన దెబ్బకు అందరికీ చెమటలు పట్టాయి. వెనక్కి తగ్గినట్టు అనిపించినా లోగుట్టు బయటపెట్టాడ‌ని  విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top