బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

 
తాడేప‌ల్లి:  బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి సీఎం వైయ‌స్‌ జగన్  ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్ట‌ర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు నాయుడు ఈ అంకెలు చూడు అర్థమవుతుంది.కులాలను రెచ్చగొట్టి, ఆహింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం, మైనార్టీలకు 116 శాతం పెంచారు' అని ఆయన వివరించారు. 

Back to Top