వంద తరాలకు సరిపడా ధనాన్ని సంపాదించాలని స్కెచ్

  వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి: అమరావతి రాజధానిపై చంద్రబాబు తీరు సరికాదంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. 'అమరావతి ప్రాంత నేల స్వభావం, భౌగోళిక స్థితిగతులు భారీ నిర్మాణాలకు అనుకూలం కాదని  శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కమిటీ నివేదికపై చంద్రబాబు హేళనగా మాట్లాడాడు. వంద తరాలకు సరిపడా రాజధాని రియల్ ఎస్టేట్ పైనే సంపాదించాలని స్కెచ్ వేశాడు. మూడు ప్రాంతాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top