వైయ‌స్‌ జగన్‌కు మోదీ అభినందనలు

 
 హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డికి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభంజనం సృష్టించడంతో మోదీ ట్వీట్ట‌ర్‌లో స్పందించారు. వైయ‌స్ జ‌గ‌న్ ప‌ద‌వీకాలం విజ‌య‌వంతం కావాల‌ని మోదీ ఆకాంక్షించారు. అలాగే కేసీఆర్ వైయ‌స్‌ జగన్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయ‌స్ జగన్‌ గెలుపుతో తెలుగు రాష్ట్ర మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.
 

Back to Top