తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వైయ‌స్ఆర్‌

వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో మ‌హానేత వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే శిల్పా, ఆర్థ‌ర్‌

క‌ర్నూలు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో  చిరస్థాయిగా నిలిచిపోయారని,  ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు, శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పేర్కొన్నారు. గురువారం క‌ర్నూలు జిల్లా న‌ల్ల‌కాల్వ స‌మీపంలోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో మ‌హానేత  12 వ వర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి ఎమ్మెల్యేలు చ‌క్ర‌పాణిరెడ్డి, తొగూరు ఆర్థ‌ర్‌, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. దివంగత మ‌హానేత‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి చ‌నిపోయి 12 సంవత్సరాల గడిచినప్పటికీ కూడా నేటికీ  తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేసుకున్నార‌ని తెలిపారు.   వైయ‌స్ఆర్ అమ‌లు చేసిన  ఉచిత విద్యుత్ ప‌థ‌కం ఆరు రాష్ట్రాలలో అమలు చేస్తున్నార‌ని తెలిపారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడుగా.. తండ్రి కంటే మిన్నగా రెండడుగులు ముందుకు వస్తూ సంక్షేమ పథకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top