వ‌రద బాధితుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది

కోత‌కు గురైన రహదారులను ప‌రిశీలించిన ఎమ్మెల్యే సంజీవ‌య్య‌
 

నెల్లూరు: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌ను, రైతుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు కోతకు గురి కావడంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య బుధ‌వారం ప‌రిశీలించారు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఉన్న మహాలక్ష్మి నగర్ గిరిజన కాలనీ సమీపంలో ఉన్న తుమ్మూరు చెరువుకు వర్షపు నీరు భారీగా చేరి కాలనీల్లోకి రావడంతో  కిలివేటి సంజీవయ్య పరిశీలించి బాధితులతో మాట్లాడారు.  మహలక్ష్మీ నగర్ కాలనీలో సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని మున్సిపల్, వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సంజీవయ్య సూచించారు. 
 తమ కాలనీలోని కొంత మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయని కొంతమందికి వివిధ కారణాల వల్ల రాలేదని ఎమ్మెల్యే సంజీవయ్య గారి దృష్టికి కాలనీవాసులు తీసుకురావడంతో...  నాయుడుపేట ఆర్డీఓ సరోజినీ తో ఫోన్లో మాట్లాడి కాలనీలోని గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. అలాగే బాధితులకు బియ్యం అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయ‌డంతో వెంట‌నే గిరిజనులకు బియ్యం అందజేశారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలు నీట మునిగాయని, వరద ప్రభావం వల్ల కొన్ని ఇళ్ళు దెబ్బతినడం జరిగిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింద‌న్నారు.    

Back to Top