సంక్షోభాలెనున్న సంక్షేమమే జగనన్న ధ్యేయం 

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మంలో ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను

జ‌గ్గ‌య్య‌పేట‌:  ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షోభాలెనున్న సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం 2వ సచివాలయం 5వ వార్డ్ లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయభాను  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అగ్రపథం లో ఉందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కుల, మత,ప్రాంత, పార్టీలు, రాజకీయాలతో పని లేకుండా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా పథకాల కోసం కార్యాలయాలు చుట్టూ తిరగకుండా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారని చెప్పారు.

 కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు తుమ్మల ప్రభాకర్,వార్డ్ కౌన్సిలర్ వట్టెం మనోహర్,ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు పెంటి శ్రీనివాస్,పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,వార్డ్ నాయకులు బోల్ల శ్రీనివాసు గరిక తిరుపతయ్య,కొమ్మూరి కొండ,సిద్దినేని నాగు,మల్లా రామారావు,అన్నెపాక రమేష్, బత్తుల శ్రీనివాస్,బిగుమల్ల పుల్లరావు,ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కటారి హరిబాబు,వార్డ్ మహిళా నాయకులు బెంబవరపు కృష్ణకుమారి,అడపా రమణి,పగడాల బుజ్జి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Back to Top