సీఎం వైయస్‌ జగన్‌ చొరవతోనే ఇంత మంచి ప్రాజెక్టు వచ్చింది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవతోనే పాణ్యం నియోజకవర్గానికి ప్రపంచంలోనే తొలి హైడ‌ల్‌ పవర్‌ ప్రాజెక్టు వచ్చిందని నంద్యాల జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా రూ.15 వేల కోట్ల పెట్టుబడితో పాణ్యం నియోజకవర్గం గుమ్మితం తాండ వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.  మనందరం కూడా రాష్ట్ర సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌  ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదన ఇంధన ప్రాజెక్టును మన జిల్లాకు ఇచ్చినందుకు పాణ్యం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకు వచ్చిన గ్రీన్‌కో యాజమన్యాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేకపోయింది. మా నాయకుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రైతులందరికీ పరిహారం ఇచ్చారు. ఏ రైతు కూడా ధర్నాలు చేయలేదు. కార్యాలయాల చుట్టూ తిరగలేదు. ఇంతగా ఆదుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు రైతుల తరఫున ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top