రాజకీయ ప్రయోజనాల కంటే..ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

శాసన మండలి రద్దు సరైన నిర్ణయం

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి నిర్ణయం సరైందే అన్నారు. మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. 
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాదులంతా కూడా మండలిని రద్దు చేయాలని కోరుతున్నారు. వాస్తవంగా రాజకీయ ప్రయోజనాలను పరిశీలిస్తే..మండలి అవసరమే. కానీ రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలు ఏ ఉద్దేశంతో అధికారం ఇచ్చారో గుర్తెరిగిన వ్యక్తిగా..మానవత్వంతో మండలి రద్దుపై సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యదేశంలో ఇలాంటి నిర్ణయాలను అందరూ స్వాగతించాలి. అందరికి సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారు. చీమకు కూడా వైయస్‌ జగన్‌ హాని చేయరు. మరిన్ని మెరుగైన నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటారు. చంద్రబాబు కౌన్సిల్‌లో అడ్డుకున్నంత మాత్రానా ఏమీ కాలేదు. ఆయన మూడు గ్రామాలకే హీరో అయ్యారు. పక్క దేశంతో యుద్ధం చేసినట్లు ఫీలవుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. ప్రజలు చంద్రబాబు ఉచ్చులో నుంచి బయటకు రావాలి.

Back to Top