పసుపు–కుంకుమ నిలిపే మద్యపాన నిషేధానికి ఓట్లేశారు

ఎమ్మెల్యే ధనలక్ష్మి
 

అమరావతి: మహిళలు పసుపు–కుంకుమకు ఓటెయ్యలేదని, పసుపు–కుంకుమ నిలిపే మద్యపాన నిషేధానికి ఓట్లేశారని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి పేర్కొన్నారు. 
చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని నమ్మి మహిళలు మోసపోయారన్నారు. మహిళలు పసుపు–కుంకుమకు ఓటెయ్యలేదని, పసుపు–కుంకుమ నిలిపే మద్యపాన నిషేధానికి ఓట్లేశారని చెప్పారు. గిరిజన గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దేవుడని, ఆయన కుమారుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గిరిజన ప్రజలకు అండగా నిలబడ్డారని చెప్పారు. పోషకాహారం లోపం వల్ల చాపరాయిలో 16 మంది చనిపోయారన్నారు. ఈ మరణాలపై వైయస్‌ జగన్‌ స్పందించి బా«ధిత కుటుంబాలను పరామర్శించారన్నారు.  రంపచోడవరం నియోజకవర్గంలో తాగడానికి నీరు లేదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. 
 

Back to Top