అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో వైయస్ఆర్‌సీపీ ఆరు వార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 36 వార్డులకు గాను ఇప్పటివరకు ప్రకటించిన 33 వార్డుల ఫలితాల్లో ఆరు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 18వ వార్డులో మట్టపర్తి నాగేంద్ర 257 ఓట్ల మెజారిటీతో, 15వ వార్డులో సంసాని శ్యామల దేవి 382 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 20వ వార్డులో దొమ్మేటి రాము 16 ఓట్ల తేడాతో, 26వ వార్డులో గొవ్వాల రాజేష్ 242 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 34వ వార్డులో చిత్రపు శ్యామల 154 ఓట్ల మెజారిటీతో, 32వ వార్డులో బండారి సత్యనారాయణ 174 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆరు వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.