చంద్రబాబు మహానటుడు

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ

ఎమ్మెల్యే చెవిరెడ్డి  భాస్కరరెడ్డి 

మీడియా పాయింట్‌: ప్రతిపక్ష నేత చంద్రబాబు మహానటుడని ఎమ్మెల్యే చెవిరెడ్డి  భాస్కరరెడ్డి విమర్శించారు. నటనలో చంద్రబాబు సినీ నటులను మించిపోయారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి  భాస్కరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణవికేంద్రీకరణను అందరూ స్వాగలించాల్సిన సమయంలో టీడీపీ వ్యతిరేకిస్తోంది. వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ వ్యతిరేకిస్తోంది.  అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. చంద్రబాబు ఏ రోజు రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోలేదు. వాడుకోవడానికి చంద్రబాబుకు ఏ సామాజిక వర్గమైనా ఒకటే. సొంత నియోజకవర్గాన్నే విస్మరించిన చంద్రబాబు. అమరావతి కోసమే చంద్రబాబు డ్రామాలు. ఇన్ని డ్రామాలు వేయాల్సిన అవసరం చంద్రబాబుకెందుకు?. బినామీలు, సొంత కంపెనీల కోసమే చంద్రబాబు ఆరాటం. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. 
 

Back to Top