జగనన్న ఆరోగ్య సుర‌క్ష‌ రాష్ట్ర ప్రజలందరికీ రక్ష

ఎమ్మెల్యే  అలజంగి జోగారావు

పార్వతీపురం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం పేద ప్ర‌జ‌ల‌కు ర‌క్ష లాంటిద‌ని ఎమ్మెల్యే  అలజంగి జోగారావు అన్నారు. నర్సిపురం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సూరక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు పాల్గొని ప్రజలకు అందుతున్న వైద్య సేవలను స్వయానా దగ్గర ఉండి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నే లక్ష్యంగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సూరక్ష కార్యక్రమం అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యానికి పూర్తి భరోసాను కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 7రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు 172 రకాల మందులను కూడా ఉచితంగా అందచేసి మీ అందరి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం మనది అని తెలిపారు. మీరంతా కూడా ఈ సేవలను తప్పక సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు పాటుపడాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకుని తమ పెద్ద కొడుకులా, సొంత కుటుంబ సభ్యుడిలా వైయస్ జగన్ ఇన్ని గొప్ప కార్యక్రమాలు తమకు అందిస్తూ చూసుకుంటున్న సీఎం వైయస్ జగన్ గారిని తామంతా మనసారా ఆశీర్వదిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎన్నికల్లో ఆయన్నే సీఎంగా గెలిపించుకు తీరుతాము అని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 

Back to Top