ఆరోగ్యశ్రీ పథకం మహానేత వైయస్‌ఆర్‌ వరం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

ఏలూరు: కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా నిరుపేదలకు అందించిన మహానుభావుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. 2007 ఏప్రిల్‌ 1వ తేదీన ఆరోగ్యశ్రీ పథకాన్ని మహానేత పేదలకు వరంగా ఇచ్చారన్నారు. ఈ రోజున ఎంతోమంది గుండె ఆపరేషన్లు చేయించుకొని సజీవంగా ఉన్నారంటే.. దానికి కారణం వైయస్‌ఆర్‌ అని గుర్తుచేశారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ.. కార్పొరేట్‌ ఆస్పత్రుల మెట్లు ఎక్కలేని పేదలకు అలాంటి ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యాన్ని ఉచితంగా అందించారన్నారు. అలాంటి మహత్తరమైన పథకానికి గత ప్రభుత్వం తూట్లు పొడిచి అనేక మంది పేదలను ఇబ్బందులపాలు చేసిందన్నారు.

ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకువచ్చారన్నారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్‌ రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకువచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టును పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 

Back to Top