రాజధాని రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ
 

 

అనంతపురం: అమరావతిలో రైతులను బెదిరించి లాక్కున్న భూములను కాపాడుకునేందుకే ఆందోళనల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. రైతులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు. అనంతపురంలో మంత్రి శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రకటన ముందే అమరావతిలో చంద్రబాబు, ఆయన తాబేదారులు బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారని, రైతులను బెదిరించి కొనుగోలు చేసిన భూములతో రియలెస్టేట్‌ వ్యాపారం చేశాడన్నారు. ఐదేళ్లలో అమరావతిలో ఒక్క తాత్కాలిక భవనం కూడా కట్టకుండా వేలాది రూపాయల ప్రజాధనాన్ని పబ్లిసిటీ, గ్రాఫిక్స్, విదేశీ పర్యటనలకు దుబారా చేశాడన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజలంతా సమర్థిస్తుంటే చంద్రబాబు మాత్రం రియలెస్టేట్‌ వ్యాపారం కోసం వ్యతిరేకిస్తున్నాడన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తుంటే.. రాయలసీమ టీడీపీ నేతలు మాత్రమ అమరావతి భజన చేస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top