తాలిబన్లకు..టీడీపీ నేతలకు తేడా లేదు

మంత్రి పేర్నినాని

రాజకీయ పబ్బం కోసం టీడీపీ ఎంతకైనా తెగిస్తోంది 

ఐదేళ్లూ రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నారు

వైయస్‌ జగన్‌పై కక్షతో రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను మంట గలుపుతున్నారు

సోషల్‌మీడియాలో సీఎం వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

డ్రగ్స్‌ కేసులో సంబంధం లేకున్నా రాష్ట్రానికి ఆపాదిస్తున్నారు

గుజరాత్‌లో పట్టుకున్న డ్రగ్స్‌కు..విజయవాడకు సంబంధం లేదు

టీడీపీ కుల రాజకీయాలతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది

ప్రజలు తిరస్కరించినా టీడీపీ నేతల తీరు మారలేదు

 తాడేపల్లి: తెలుగు దేశం పార్టీ నేతలకు, ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్లకు తేడా లేదని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎక్కడో గుజరాత్‌తో పట్టుబడ్డ డ్రగ్స్‌కు..విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రజలు టీడీపీని తిరస్కరించినా..ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

తెలుగు తమ్ముళ్లు అందరూ కూడా బజారున పడి గ్రామ సింహాలకు పోటీగా అరుస్తున్నారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మాన మర్యాదలు ఉంటాయి. కన్నతల్లి అంటే ఎనలేని గౌరవం ఉంటుంది. ప్రతి మనిషికి తను పుట్టిన గడ్డపై మమకారం, ప్రమే, భక్తి ఉంటుంది.  జన్మభూమిని, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని ప్రతి పౌరుడు కూడా తల్లితో సమంగా భావించి పూజిస్తారు. కానీ కన్నతల్లితో సమానమైన ఏపీ మానమర్యాదను వీళ్లు కాల రాస్తున్నారు. వైయస్‌ జగన్‌పై ఉన్న అక్కస్సు, రాజకీయ కక్ష్యను తీర్చుకునేందుకు ఏపీ గౌరవ ప్రతిష్టను టీడీపీ రాక్షస మూకలు మంట గలపడం కళ్లారా చూస్తున్నాం.

 ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్లకు, వీళ్లకు తేడా లేదు. వీళ్ల మనస్థత్వం, పోకడలు గమనిస్తే..వీళ్లందరూ కూడా ఆంధ్ర తాలిబన్లుగా మనకు అర్థమవుతున్నారు. వీళ్ల రాజకీయ బతుకుల కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారు. ఒకడంటాడు..రూ.72 వేల కోట్ల డ్రగ్స్‌ ఎక్కడా అంటాడా. తాడేపల్లి ప్యాలెస్‌లోనా అంటున్నాడు. ఐదేళ్లు రాబంధుల్లా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. పాపపు సొమ్ముతో సోషల్‌మీడియాలో పోస్టు పెడితే ..ఒక్కో పోస్టుకు ఇంతా అని వెదజల్లి ఫేస్‌బుక్, యూట్యూబ్స్‌లో పోస్టులు పెట్టించి విష ప్రచారం చేస్తున్నారు. 

ఇలాంటి పోస్టులతో వైయస్‌ జగన్‌కు ఊడేది ఏమీ లేదని వీళ్లు తెలుసుకుంటే మంచిది. మీ తప్పుడు రాతల వల్ల ఫేస్‌బుక్, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించడం వల్ల మీ సొమ్ము కరగడం తప్ప..ఏమీ కాదు. గత ఐదేళ్లు వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని చంపి మానసికంగా కుంగదీయడానికి పేపర్లు, టీవీలు సరిపోక, సోషల్‌ మీడియాలో డబ్బులు వెదజల్లి విష ప్రచారం చేసినా ఏం సాధించారో..ఏం పాపం మూటకట్టుకున్నారో మీకే తెలుసు. వైయస్‌ జగన్‌ పట్ల ప్రజలు ఏరకమైన ప్రేమ చూపారో ఇకనైనా తెలుసుకొని బుద్ధి తెచ్చుకోండి. 

బాధ్యతాయుతమైన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌..పట్టుబడ్డ డ్రగ్స్‌కు, విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేశారు. ఆప్ఘనీస్థాన్‌ నుంచి ఢిల్లీకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఎంత విడమరచి చెప్పినా కూడా వీళ్ల విషపు బు్రరలకు ఎక్కే పరిస్థితి లేదు. పరాయి రాష్ట్రాల్లో జరిగిన నేర ఘటనలకు అక్కడి రాజకీయ పార్టీలకు అంటగట్టడం ఎక్కడా చూడలేదు.

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఏయిర్‌ పోర్టులో ప్రతి రోజు వందల సంఖ్యలో ఇలాంటి కేసులు పట్టుబడుతుంటాయి. కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతుంటుంది. అక్కడున్నటువంటి ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వం చేయిస్తుందని ఎప్పుడైనా ఆరోపించాయా?. ఈ దిక్కుమాలిన తనం 74 ఏళ్ల ముసలి నక్కకు ఉంది తప్ప..మరెవరికీ ఇలాంటి ఆలోచనలు లేవు. 

–హైదరాబాద్‌ ఏయిర్‌ పోర్టులో పచ్చబ్యాచ్‌కు చెందిన ఓ ఆకు రౌడీ ఆప్ఘనీస్థాన్‌ వెళ్తూ తుపాకి గుళ్లతో పట్టుబడటం వాస్తవమా?కాదా? 
–గుంటూరు జిల్లాకు చెందిన నేత పాల కంపెనీ ట్యాంకుల్లో 2014–2019 దాకా యధేచ్చగా..నిరాటంకంగా కాపు సారా, ఎ్రర చందనం చెన్నై, బెంగళూరుకు S తరలించి కోట్లు దండుకున్నది వాస్తవమా? కాదా? 
– హెరిటేజ్‌ వ్యాన్లలో చంద్రబాబు ఎ్రరచందనం దుంగలను కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్‌కు తరలించడం వాస్తవమా? కాదా? 
– ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గుళ్లో క్షుద్రపూజల పాప పరిహారంతో 23 సీట్ల ప్రాప్తితో రాజకీయంగా దిక్కుమాలిన చావు చచ్చింది నిజమా? కాదా?
– పెద్ద పెద్ద చదువులు చదువుకుని విజ్ఞత కలిగి ఉండే విలేకరి ఉద్యోగం వెలగబెట్టిన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ అనేది అచ్చు వేయకుండానే నోట్లు ముద్రగుద్దుకున్న ఒక ప్రబుద్ధుడు తన నీచ బుద్దిని ట్వీట్ల ద్వారా ఎంత హీనంగా, హేయంగా ఇవాళ బయట పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం
– ఇవాళ టీడీపీ వాళ్లకు రాష్ట్రంపై ప్రేమ కంటే కులం కులం అంటూ ఎంత హేయంగా ప్రవర్తిస్తున్నారో చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నా..వీళ్లకు అర్థం కావడం లేదు.  
– బ్రహ్మణుల స్థలాలు, ముస్లింల స్థలాలు కబ్జా చేసి, చంద్రబాబుతో కేసులు పెట్టించుకుని బెజవాడను భూకబ్జాలకు అడ్డాగా తయారు చేసిన నేరగాళ్లు కూడా ఇవాళ వైయస్‌ జగన్‌ గురించి, గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌ గురించి అవాకులు, వాకులు పేలుతున్నారంటే ఇంతకన్నా ముక్కు మీద వేలు వేసుకోవడం ఏముంటుంది?
– ఇంతింత దుర్మార్గాలకు ఒడిగట్టిన వీళ్లు ఈ రోజు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ల ముఖాలపైన ప్రజలందరూ ఉమ్ము వేసినా సిగ్గురాని విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులను వారి విజ్ఞతకే వదిలేస్తూ..వాళ్లందరికీ ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. 

మీ నీచమైన, హేయమైన బుద్ధితో వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఐదేళ్లు అహోరాత్రులు శ్రమించి, పేపర్లు, టీవీలు చాలక సోషల్‌ మీడియాలో మీ పాపపు సొమ్ము వెదజల్లినా..ప్రజలు ఏరకంగా మీ మాడు పగులగొట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా బుద్ది తెచ్చుకోకుండా దిగజారి ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు.

అసెంబ్లీ పంచాయతీ, మున్సిపాలిటి ఎన్నికలే కాదు..నిన్న కాక మొన్న జరిగిన పరిషత్‌ ఎన్నికల్లోనూ మిమ్మల్ని ఏరకంగా రాజకీయంగా ఛిద్రవధ చేశారు. ప్రజలు ఎన్ని శిక్షలు వేసినా కూడా మీకు బుద్ధి రాకపోవడంతో ఆ భగవంతుడికే మిమ్మల్ని వదిలేస్తున్నాం. మీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌ ఫలితాలు కూడా రావు. రాష్ట్రం మానమర్యాదలకు ఇబ్బంది కలిగేలా మాట్లాడవద్దని టీడీపీ నేతలకు పేర్ని నాని హితవు పలికారు.

 

తాజా వీడియోలు

Back to Top