ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డే నాయ‌కుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

తూర్పుగోదావరి: ఎంత క‌ష్ట‌మొచ్చినా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డే నాయ‌కుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కురసాల క‌న్న‌బాబు అన్నారు. లక్షలాది మంది ఆడ‌ప‌డుచుల పేరు మీద ఇళ్ల స్థలాలు పంపిణీ చేయ‌డం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వల్లనే సాధ్యమైందన్నారు. మంత్రి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. పేద‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేయాల‌నే త‌ప‌న‌తో సీఎం ప‌నిచేస్తున్నార‌న్నారు. పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఇళ్లు నిర్మించి ఇస్తున్నార‌న్నారు. పిల్లలకు పుట్టింటి ఆస్తిలా ఇళ్ల స్థలాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చార‌ని, ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన స్థలాన్ని అమ్ముకోవద్ద‌ని ల‌బ్ధిదారుల‌కు సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top