టీడీపీ, జనసేనది అమామాస్య పొత్తు 

మంత్రి కారుమూరి సెటైర్లు

రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల తొత్తుగా మారింది

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సింహం..సింహం సింగిల్‌గానే వస్తుంది

విజ‌య‌వాడ‌: టీడీపీ, జనసేనది అమావాస్య పొత్తు అని.. జైల్లో దొంగలు లాగా వారు కలిశార‌ని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల తొత్తుగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ..పార్టీ కేడర్‌ ఎన్నికలకు సిద్ధమయ్యేలా సీఎం వైయ‌స్ జగన్‌  ఏలూరు సభ నుండి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నార‌ని చెప్పారు. ఏలూరు జిల్లాలో ఒకటో తేదీన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నార‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ట ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ తెచ్చి ఆడవాళ్లు గడప దాటకుండా వారికి సంక్షేమాన్ని చేర్చిన  గొప్ప వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్ అని కొనియాడారు. మేము చేసిన సంక్షేమం, టీడీపీ చేసిన అవినీతి ప్రజలకు తెలియజేస్తామ‌న్నారు. తెలంగాణలో వైయ‌స్ఆర్‌టీపీ పార్టీని తగలబెట్టి ఇక్కడికి వచ్చింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో నీతి అయోగ్ నివేదికలు చూస్తే షర్మిలకు తెలుస్తుంద‌ని హిత‌వు ప‌లికారు. సింహం సింగిల్‌గానే వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. సోనియా గాంధీని సీఎం వైయ‌స్ జగన్‌ ఏవిధంగా ఢీకొన్నాడో షర్మిలకు బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రం మూలాలు, పోలవరం అంటే కూడా ఏమిటో షర్మిలకు తెలియద‌ని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.
 

Back to Top