వెన్నుపోటు రాజ్యాంగం ఇక్కడ అమలు జరగదు..!

వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు 

 టీడీపీ- ఎస్ఈసీది ఫెవికాల్ బంధం..! 

 నిమ్మాడ వెళ్ళి.. గొల్లలకుంట వస్తే నిమ్మగడ్డ చిత్తశుద్ధి తెలిసేది..? 

 గంటల వ్యవధిలో నిమ్మగడ్డ, లోకేష్ లు గొల్లలకుంట రావటం వెనుక మతలబు ఏమిటి? 

 ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యవస్థ అన్నది నిమ్మగడ్డ గుర్తెరగాలి 

 గ్రామ పంచాయితీలు ఎకగ్రీవం అయితే.. టీడీపీకి ఎందుకు వణుకు..? 

  పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ బలపరచడానికి కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదు 

 కండకావరంతో అచ్చెన్నాయుడు పోలీసులమీద వ్యాఖ్యలు చేశాడు 

కాకినాడ‌:  వెన్నుపోటు రాజ్యాంగం ఇక్క‌డ అమ‌లు జ‌ర‌గ‌ద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ప‌క్ష‌పాత ధోర‌ణి అవ‌లంభిస్తున్నార‌ని, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ల‌బ్ధి చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ రాష్ట్ర అద్య‌క్షుడు అచ్చెన్నాయుడు కండ‌కావ‌రంతో పోలీసుల మీద వ్యాఖ్య‌లు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం కాకినాడ‌లో క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడారు.  

  • ఒకేరోజు కొద్ది గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లా గొల్లలకుంటలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటించడాన్ని ఏ విధంగా చూడాలి..? శ్రీనివాసరెడ్డి ఏవిధంగా మరణించాడన్నది ఇంకా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అలాంటి ఆయన మృతిని రాజకీయం చేసే వారికి ఎస్ఈసీ మద్దతు పలుకుతున్నారనే సందేశం ఇవ్వకూడదు.
  • - వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నట్టుగా, ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా ఎన్నికలు జరిగాయా.. ? ఈ ప్రభుత్వం చాలా పకడ్బంధీగా చర్యలు తీసుకోవడం వల్లే ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 
  • - అలాంటిది పంచాయితీ ఎన్నికల్లో  ఏకగ్రీవంగా ఎన్నిక అవడమే మహా దుర్మార్గం అన్నట్టుగా ఎన్నికల కమిషనర్ మాట్లాడటం కరెక్టు కాదు. 
  • స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రశాంతంగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్ అనుకుంటే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం అయిన నిమ్మగడ్డ గ్రామంలో అంత దౌర్జన్యం జరిగితే అక్కడకు ఆయన ఎందుకు వెళ్ళలేదు. నిమ్మాడ ఘటనపై ఎందుకు స్పందించలేదు..? దానివెనుక ఏమైనా వ్యూహం ఉందా.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్న ఈ పరిస్థితుల్లో  నిమ్మగడ్డ గారు గొల్లలకుంట గ్రామాన్ని సందర్శించడం వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటి..? అంటే టీడీపీ- నిమ్మగడ్డ బంధం తెలియడం లేదా..?
  •  ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి చాలా వివాదాస్పదంగా ఉంది. 2018 నుంచి ఒక్క కాకినాడ ఎన్నిక మినహా, ఆఖరికి పదవుల్లో ఉండి మరణించిన వ్యక్తుల స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేదు. ఆరోజు మీకు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు రాలేదా..? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు.? అప్పుడెందుకు మీకు రాజ్యాంగం కనిపించలేదు..?
  •  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రతి చర్యా ప్రభుత్వంపై కక్ష సాధింపు వ్యవహారంగా చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ మాత్రమే రాజ్యాంగ వ్యవస్థగా.. ప్రభుత్వం రాజకీయ వ్యవస్థగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు.. ప్రభుత్వం కూడా రాజ్యాంగ వ్యవస్థే, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వ్యవస్థ అన్నది నిమ్మగడ్డ గుర్తెరగాలి. 
  •  గొల్లలకుంట గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మరణంపై.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అధికారులతో సమీక్షించిన తర్వాత అయినా, ఆయన అనుమానాలు నివృత్తి అయిఉంటాయి. కాకపోతే అప్పుడు ఆ గ్రామానికి ఎస్ఈసీ వెళ్ళి ఉండాల్సింది.  కానీ, తూర్పు గోదావరి జిల్లాలో ఏదో ఫ్యాక్షనిజం ఉన్నట్టు, ప్రజలను చంపుకుంటున్నట్లు, ఏకగ్రీవాలు జరిగితే నేరం అన్నట్లు, దౌర్జన్యకరంగా ఏకగ్రీవాలు జరుగుతున్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు..?
  • 2013లో 21,141 పంచాయితీలకు ఎన్నికలు జరిగితే.. 2,623 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 764 ఆనాటి అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన వారి వశమైతే, ఆ తర్వాత స్థానంలో 570 స్థానాలతో టీడీపీ, 400 పంచాయితీలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇవన్నీ కూడా దౌర్జన్యంగా గెలిచినవే అని మీరు చెప్పదలచుకున్నారా..? అప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఎక్కువ జరిగాయి. ఎన్నికలు ఏకగ్రీవాలు జరిగితే.. సైకిల్ జోరు మీద ఉందని ఇదే ఎల్లో మీడియా ఆరోజు బ్రహ్మాండంగా చూపించింది. మరి అప్పుడు ఒక న్యాయం.. ఇప్పుడు ఒక న్యాయమా..? 2013 ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై అప్పట్లో మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో కూడా అప్పటి వీడియోలను మంత్రి కన్నబాబు ప్రదర్శించారు.  
  • నిమ్మగడ్డ ఏకపక్షంగా, ఈ ప్రభుత్వం మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజ్యాంగ వ్యవస్థగా ఉండి ఆయన హైదరాబాద్ లోని హయత్ హోటెల్ లో రాజకీయ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ఆయన ఎవరెవర్ని కలిసింది, ఎందుకు కలిసిందన్నది ప్రజలు గమనించారు. 
  • ఎన్నికల కమిషనర్ కు అంత చిత్తశుద్ధి ఉంటే.. ముందుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆయన చేసిన అరాచకం, దౌర్జన్యంపై స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి పరిస్థితులను ఎందుకు చూడలేదు. అక్కడకు వెళ్ళి వచ్చి.. తర్వాత గొల్లలకుంటకు వచ్చి పరామర్శిస్తే.. నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. అలా కాకుండా కొద్ది గంటల సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ, లోకేష్ ఈ గ్రామానికి రావడం చూస్తుంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి. 
  • గొల్లలకుంట వచ్చి ప్రభుత్వంమీద, ముఖ్యమంత్రి జగన్ గారి మీద లోకేష్ పిల్లి శాపాలు పెడుతున్నాడు. ఆయన శాపాలకు ఉట్టి విరిగిపడదు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు కారణాలేమిటో విచారణ కూడా జరగకుండా, జగన్ మోహన్ రెడ్డి గారు కారణం అని లోకేష్ మాట్లాడుతున్నాడంటే ఆయన అజ్ఞానం బయటపడుతుంది. రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారని అంటూ లోకేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వెన్నుపోటు రాజ్యాంగానికి టీడీపీ- చంద్రబాబు పేటెంట్. అందుకే మిమ్మల్ని గత ఎన్నికల్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 
  • ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాట్లాడుతూ..  తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చాలా బాగా జరిగాయని,  చాలా ప్రశాంతంగా ఉందంటే.. ఇక్కడేదో అరాచకం జరుగుతుందని లోకేష్ అంటున్నాడు. అరాచకం అంటే.. గోదావరి పుష్కరాలకు వచ్చి.. మీ ప్రచారం కోసం, మీ తండ్రి పాపానికి 29 మంది చనిపోతే..అప్పుడెందుకు మీరు వెళ్ళి పరామర్శించలేదు..
  • ఎన్నికలకు వైయస్ఆర్సీపీ ఎప్పుడూ భయపడదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ ఎంతగా కలిసిపోయి కుట్రలు పన్నినా మేం భయపడం.  వారిద్దరి వ్యవహర శైలి చూస్తే.. టీడీపీ- ఎస్ఈసీ ఫెవికాల్ బంధం కనిపిస్తోంది. 
  • ఏకగ్రీవాలు ఇప్పుడే కొత్త అన్నట్టుగా టీడీపీ, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవాలు ప్రారంభం కాకముందే.. 1992లో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో ప్రారంభమయ్యాయి. సమరస్ యోజన అని ఒక పథకం పెట్టి.. ఆరోజుల్లోనే గుజరాత్ లో ఏకగ్రీవాలు ప్రారంభించారు. హర్యానా, తెలంగాణలో కూడా ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహిస్తున్నాయి. 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవాలకు ప్రోత్సహకాలు ప్రకటించింది. 2013లో వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రోత్సహించింది. హిమాచల్ ప్రదేశ్ నుంంచి తెలంగాణ వరకు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ వచ్చాయి. 
  •  గ్రామాలు శాంతియుతంగా ఉండాలని ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. టీడీపీ నాయకులు ఎందుకు వణికిపోతున్నారు. టీడీపీ బలపరచడానికి చాలా చోట్ల కనీసం అభ్యర్థులను కూడా పెట్టలేకపోతున్నారు. మీకున్న బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి మీద బురద చల్లుతున్నారు. సిగ్గు లేని రాజకీయం ఎంతకాలం చేస్తారు చంద్రబాబూ..
  • టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీద దాడి జరిగితే.. చంద్రబాబు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. అదే ఆయన పార్టీలో వేరే వాళ్ళకు ఏదైనా జరిగితే ఎందుకు హాజరు కాలేకపోయాడు. అచ్చెన్నాయుడుకు ఒక న్యాయం.. పట్టాభికి ఒక న్యాయమా..? నిమ్మాడ పంచాయితీలో అచ్చెన్నాయుడు దశాబ్దాలకాలంగా అరాచకాలు చేస్తూ, ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నాడన్నది అందరికీ తెలిసిన విషయమే. 
  •  ఖాకీ డ్రస్ చూస్తేనే అసహ్యం వేస్తుందని అచ్చెన్నాయుడు మాట్లాడటం చూస్తుంటే.. ఎంత కండ కావరం అనిపిస్తోంది. మేం వస్తాం.. మీ సంగతి చూస్తాం.. అని కలలు అలాగే కనండి. ఇలాంటి పొగరబోతు స్టేట్ మెంట్స్ కు ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు. ఇలానే మాట్లాడితే.. మీకు మళ్ళీ మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ 60 నెలల పదవీ కాలంలో 54 నెలలు ఏ పని చేయకుండా నిద్రపోయి.. ఇప్పుడే మెలుకువ వచ్చినట్లుగా,  చివరిగా ఆరు నెలలు కాలంలో ఎన్నికలు పెట్టాలని హడావుడి పెడుతున్నారు. 
  • పంచాయితీల గురించి ఇంతగా లెక్చర్లు ఇస్తున్న చంద్రబాబుకు అసలు సిగ్గు,శరం ఉందా..? కనీసంగా 13, 14 ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఖర్చు పెట్టకుండా, తన దగ్గర పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది. అలానే 2014లో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి, దాన్ని కనిపించకుండా దాచిపెట్టిన చరిత్ర చంద్రబాబుది. అలాంటిది పార్టీల రహితంగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీకి చిన్న నోటీసు ఇచ్చి వదిలేస్తారా..?  ఇది పక్కదారి పట్టించడం కాదా నిమ్మగడ్డ గారూ.. 
  • - న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడూ చెబుతారు. 
  • మార్చి 31కి ఎన్నికల కమిషనర్ పదవీకాలం పూర్తైన తర్వాత ఆయన టీడీపీలో చేరతారని చెబుతున్నారు. అందుకే ఆయన దుగ్గిరాలలో ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారని అంటున్నారు. ఎన్నికల కమిషనర్ గా ఎన్నికల ప్రక్రియలో సమానమైన ప్రాధాన్యతతో అందరినీ ఒకేలా చూడాలి. అలాకాకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే.. ఎన్నికల కమిషన్ కు ఎటువంటి విలువా ఉండదు.

తాజా వీడియోలు

Back to Top