విశాఖ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆ రోజు దీక్ష చేస్తే చంద్రబాబు పోలీసులతో కట్టించలేదా అని నిలదీశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధీనంలో పాలన ఉందని, తిరుపతిలో జరిగిన వ్యవహారం చట్టపరంగా ఉందన్నారు. చంద్రబాబు చెపినట్లే తప్పిదం అయితే ఎస్ఈసీని అడగమని సూచించారు. ఓటమి భయంతో చంద్రబాబు విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.