దగుల్బాజీ రామోజీ తప్పుచేస్తే ప్రశ్నించకూడదా..?

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: ప్రత్యామ్నాయ పంటలపై తన వ్యాఖ్యలను ఈనాడు పత్రిక వక్రీకరించిందని  వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు వేయమని రైతులకు సూచించామని, తన మాటలను వక్రీకరిస్తూ ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రామోజీరావు గురివింద సామెతలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగుల్బాజీ రామోజీరావు తప్పు చేస్తే ప్రశ్నించకూడదా..? అని ఫైరయ్యారు. తప్పుడు వార్తలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. 
 

Back to Top