చంద్రబాబు కక్కుర్తి.. కొన్ని వ్యవస్థలకు శాపాలు 

రోడ్ల బాగుకు ఉపయోగించే నిధులనూ వాడేసుకున్నాడు

రూ.2,205 కోట్లతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపిస్తున్నాం

ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా

విజయవాడ: దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఐదేళ్ల పాలన సాగిందని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చంద్రబాబు కక్కుర్తి పనులు కొన్ని వ్యవస్థలకు శాపాలయ్యాయన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సిన రూ.300 – 400 కోట్లను తమ సొంత అవసరాలకు చంద్రబాబు వాడుకున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు దత్తపుత్రుడు, ఎల్లోమీడియాతో అసత్య ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలనలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. 
 

Back to Top