చేనేత వస్త్రం ధరించి నేతన్నను ఆదుకుందాం

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

 

విశాఖపట్నం: యువత కనీసం వారానికోసారి చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు. హస్త కళాకృతులను కొని కళాకారులను ఆదుకోవాలన్నారు. విశాఖలో మంత్రి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. దేశానికి ఒకేఒక హీరో స్వామి వివేకానంద అని, 125 కోట్ల జనాభా ఉన్న దేశానికి యువతే మార్గదర్శకమన్నారు. చేనేతలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ.24 వేల ఆర్థిక సాయం చేశారన్నారు. యువత కూడా వారంలో ఒక్కసారి చేనేత వస్త్రాలను ధరించి నేతలను ఆదుకోవాలన్నారు. అదే విధంగా యువత దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందన్నారు.

Back to Top