తాను గెలవలేదు...మ‌మ్మ‌ల్ని గెలవనీయడట !

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

ప‌ల్నాడు: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరుపై మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. తన దూర కంత లేదు మెడకో డోలు అన్నట్లు..తాను గెలవలేదు...గెలవలేడు ! వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనీయడట ! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.  

మేము కాదు గాడిదలం! ..చంద్ర‌బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి! అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ఉద్దేశించి మంత్రి అంబ‌టి రాంబాబు అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top