చంద్రగిరి, మంగళగిరిలో మీకు మిగిలేది శంకరిగిరిమాన్యాలే!

మంత్రి అంబ‌టి రాంబాబు

తాడేప‌ల్లి: చంద్రగిరి, మంగళగిరిలో చంద్ర‌బాబు, లోకేష్‌కు మిగిలేది శంకరిగిరిమాన్యాలేన‌ని మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  మీరు ఇష్టమొచ్చినట్లు పోటీ చేయొచ్చా అని మంత్రి అంబటి ప్ర‌శ్నించారు. సీఎం వైయ‌స్ జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అర్థం లేని రాజకీయ విమర్శలు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 2014-2019 మ‌ధ్య అంత అద్భుతమైన పాలనే అందించి ఉంటే ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా? మళ్లీ చక్కని పాలన అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిల‌దీశారు. వైయ‌స్‌ జగన్‌ సింగిల్‌గా వచ్చి 151 సీట్లు గెలిచారు..ఇప్పుడు మళ్లి 175కి 175 గెలిచే విధంగా అడుగులేస్తున్నార‌ని తెలిపారు. పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్ల మార్పులు జరుగుతున్నాయ‌ని మంత్రి చెప్పారు. ఇప్పుడు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్‌. 
మా సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు చేరాయ‌ని స్ప‌ష్టం చేశారు. 60 శాతంపైగా  ప్రజలు వైయ‌స్ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో అరంగేట్రం చేశారు.  అసలు కుప్పంలో పోటీ చేస్తారా?, లోకేష్‌ను మంగళగిరిలో పోటీకి నిలపడం మార్పు కాదా? అనిప్ర‌శ్నించారు. పురంధేశ్వరి నియోజకవర్గం ఎక్కడో చెప్పగలారా?
మీరు ఇష్టమొచ్చిన చోట పోట చేయొచ్చా? అని నిలదీశారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను పల్లకి మోసేవాళ్లుగానే టీడీపీ చూస్తోంద‌ని, వచ్చే ఎ‍్ననికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

Back to Top