చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

విజయవాడ: గౌరవ హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. విజయదశమికి చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశంపై చర్చించారు. అక్టోబర్‌ 5న టెండర్‌ అనంతరం మరోసారి భేటీకి మంత్రులు నిర్ణయించారు. ఒక ఉన్నతాధికారిని నియమించి వేగంగా చక్కెర అమ్మకాలు జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
 

Back to Top