విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోందని విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లా కమిటీ సభ్యులతో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ సమావేశమయ్యారు.ఈ భేటీలో పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, యాక్టివిటీ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు ఏమన్నారంటే.. గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలి. అంకితభావం, కష్టపడేతత్వం, కెపాసిటీ ఉండే వ్యక్తులకు పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీ పిలుపు మేరకు ప్రతీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి. వైయస్ఆర్ సీపీ అనుబంధ విభాగాలన్నీ పార్టీకి వెన్నెముకలాగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాలు కమిటీలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గారి అనుమతితో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వైయస్ఆర్ సీపీ అనుబంధ విభాగాలన్నీ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ, అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, సమస్యలు ఎప్పటికప్పుడు మీ అసెంబ్లీ ఇంచార్జ్‌కి, జిల్లా పార్టీ అధ్యక్షులకు తెలియజేయాలి. ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సమన్వయంతో ముందుకెళ్ళాలి. అక్రమ కేసులు,వేధింపులను గట్టిగా ఎదుర్కుని కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్ సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపట్టడం, కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పించడం, చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి వచ్చేలా ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, నాయకులు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని నేతలకు చిన్న శ్రీను దిశానిర్దేశం చేశారు.