అమలాపురం: వైయస్ఆర్‌సీపీ అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండల విస్తృతస్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఎస్‌ఈసీ మెంబర్, వైస్ ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులకు వారి గ్రామాలకు సంబంధించిన పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలను విస్తృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శులు బొంతు గోవింద్‌శెట్టి, ధంగేటి రుద్ర, రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి చొల్లంగి సుబ్బురాం, జాన గణేష్, పొనకల గణేష్, పొలమూరి బాలకృష్ణ, కేత భానుతేజతో పాటు మండల, గ్రామ అనుబంధ విభాగాల సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.