21న క‌ర్నూలు జిల్లా వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా స‌మావేశం

పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన పార్టీ జిల్లా అధ్య‌క్షులు, మేయ‌ర్ బీ.వై.రామ‌య్య‌

క‌ర్నూలు: ఈనెల 21వ తేదీన క‌ర్నూలు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, నగర మేయర్ బీ.వై. రామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో స‌మావేశానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీ.వై.రామ‌య్య మాట్లాడుతూ.. వచ్చే మంగళవారం బళ్ళారి చౌరస్తాలోని సూరజ్ గ్రాండ్ నందు ఉదయం 10:30 గంటలకు వైయ‌స్ఆర్ సీపీ సోష‌ల్ మీడియా సమావేశం జరుగుతుందని, ముఖ్యఅతిథిగా రాష్ట్ర సోషల్ మీడియా, మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ రెడ్డి హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సభ్యులంతా తరలిరావాలని కోరారు. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో క‌ర్నూలు జిల్లా సోషల్ మీడియా ప్ర‌తినిధులు ఇంద్రసేన రెడ్డి, గిరిప్రసాద్, మధుశేఖర్, అవిన్, కార్పొరేటర్ లక్ష్మికాంత రెడ్డి, నాయకులు కటారి సురేష్, బ్రహ్మానంద రెడ్డి, వెంకటసాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top