వైయస్ఆర్‌సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ

కాకినాడ జిల్లా:  జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాజీ మేయ‌ర్‌ పోలసపల్లి సరోజ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్‌.టి.రాజపురం నైట్‌ స్టే పాయింట్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో స‌రోజ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్ధి సీహెచ్ సునీల్, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top