విజయవాడ: వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన 'జగనన్న 2.0 సూపర్ యాప్`ను ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పునూరు గౌతమ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, పార్లమెంట్ కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచేందుకు జగనన్న 2.0 సూపర్ యాప్‌ను రూపొందించారని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ యాప్ వారధిగా పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యాప్ ప్రారంభమైన నాటి నుంచే కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైందని పేర్కొన్న ఆయన, ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాప్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్త తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు, స్థానిక సమస్యలను యాప్ ద్వారా నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల గొంతుకను అణిచివేసే పరిస్థితుల్లో వారి సమస్యలను నేరుగా పార్టీ నాయకత్వానికి చేరవేసే వేదికగా జగనన్న 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని అన్నారు. పత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియాలో ఆంక్షలు పెడుతూ ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణను ప్రభుత్వం పరిమితం చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ఈ యాప్ ద్వారా తన సమస్యను తెలియజేయవచ్చని, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. అవసరమైతే పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌తో కూడా ఈ వేదిక ద్వారా అనుసంధానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి వైయస్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త, సోషల్ మీడియా ప్రతినిధి జగనన్న 2.0 సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.