కాసేపట్లో పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమథన సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గత మూడు రోజులుగా ‘మన పాలన – మీ సూచన’పై మేధోమథన సమీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమథన సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమీక్షలో భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై చర్చించనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఊతమిస్తోంది. విదేశీ పెట్టుబడులు, సంస్థల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్‌ ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు 39 భారీ సంస్థలు ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.  

Back to Top