నెల్లూరులో సీఎం వైయ‌స్ జగ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

నెల్లూరు జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) నెల్లూరు జిల్లాలో కొనసాగునుంది. బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం వైయ‌స్ జ‌గ‌న్ బస్సుయాత్రకు బయలుదేరుతారు. సీఎం వైయ‌స్ జగన్‌కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ అనం అరుణమ్మ, మేయర్ స్రవంతి, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైయ‌స్ జగన్. ఈ సందర్బంగా పార్టీ నేతలకు ముఖ్య‌మంత్రి దిశా నిర్దేశం చేశారు.

నేడు కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్‌ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

 

Back to Top