విశాఖపట్నం: మహాత్ముని ఆశయాలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ నగర కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మహాత్మా గాంధీ గొప్పనేత. ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం. నోబెల్ బహుమతి కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. పేదల కోసం నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. వైయస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టింది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వైయస్ జగన్ ఎక్కడ కూడా హింసాత్మకంగా వ్యవహరించలేదు. గాంధీజీ పుట్టిన రోజునే లాల్ బహుదూర్ శాస్త్రి కూడా జన్మించారు. ఆయన పాలించింది కొద్ది రోజులే అయినా మంచి పాలన చేశారు' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తూచా తప్పక అమలు చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. జగన్ సారథ్యంలోని వైయస్సార్‌సీపీ మహాత్ముని అడుగుజాడల్లోనే నడుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసా సీఎం జగన్ పేదవాడి కోసం ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 16 నెలల్లో 59 వేల కోట్లు సీఎంఖర్చు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సైలెంట్ మెన్. ప్రతిపక్ష పార్టీ ఎన్ని విమర్శలు చేసిన ఆయన పని ఆయన చేసుకుపోతాన్నారు. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మహాత్మాగాంధీ ఆశయాలను సీఎం కొనసాగిస్తున్నారు. వైయస్ఆర్ సీపీ చేస్తున్న అనేక పనులకు టీడీపీ రకరకాలుగా అడ్డుపడుతోంది' అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు.