`గడప గడపకు` జ‌న హారతి  

అమ‌రావ‌తి: రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి ప్రజలు అడుగడుగునా హారతి పట్టి సాదరంగా ఆహ్వానించారు. పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఆనందంగా చెప్పారు.  వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని వారు ఆకాంక్షించారు. కొన్ని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top