మాజీ ఎంపీ జే.శాంత వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి:  వాల్మీకి సామాజిక వ‌ర్గానికి చెందిన అనంత‌పురం జిల్లా మాజీ ఎంపీ జే.శాంత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో శాంత వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  శాంత 2009 లో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  కార్యక్రమంలో  ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, అనంత‌పురం జిల్లా పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

Back to Top