మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అరెస్ట్  

మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలింపు

పోలీస్ స్టేషన్ కు ఇరువైపుల భారీగా పోలీసుల మోహరింపు

ర‌మేష్ కుమార్ రెడ్డిని ప‌రామ‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి

అన్న‌మ‌య్య జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. అన్న‌మ‌య్య జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని నిన్న రాత్రి లక్కిరెడ్డిపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకుని మదనపల్లి స్టేషన్ కు తరలించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాడని, మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేరని ర‌మేష్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే ఆయ‌న్ను ఏ స్టేషన్‌కు త‌ర‌లిస్తున్నారో కుటుంబ స‌భ్యుల‌కు స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ఆందోళ‌న నెల‌కొంది.  మదనపల్లి లో రమేష్ రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజు రోజు కీ పెరిగిపోతున్నాయ‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం, అరెస్టులు చేస్తాం అనడం ఎంతవరకు సమంజసమ‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ నేత‌లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన మాటలు మాట్లాడార‌ని, మేము వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపితే ఇలా వేధింపుల‌కు దిగుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఈ కూటమి పాలన సాగుతోంద‌ని, మీరెన్ని కుట్ర‌లు చేసినా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బ తీయలేర‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top