భూ దోపిడీని అరికట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి 

 జిల్లా జాయింట్ కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వినతి 

 మార్కాపురం: జిల్లా కేంద్రం మార్కాపురం పరిసరాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు కోరారు. సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు.

భ్రమర వెంచర్స్‌ నిర్వాహకులు చట్టవ్యతిరేకంగా చెరువు తొట్టిలో నిర్మించిన రోడ్డు, పైప్ కల్వర్టును వెంటనే తొలగించాలని కోరారు. చెరువు బఫర్ జోన్ పరిధిలో వేస్తున్న లేఅవుట్లను నిలిపివేసి, ప్రభుత్వ భూములు, చెరువు స్థలాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. భూ దందాలకు పాల్పడుతున్న వారితో పాటు అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపైనా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించి జిల్లా ప్రతిష్టను కాపాడాలని అన్నా రాంబాబు జాయింట్ కలెక్టర్‌ను కోరారు.
 

Back to Top