తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న సీదిరి అప్పలరాజుతో వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడి, జైలు నుంచి విడుదలైన అనంతరం ఎదురైన పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పలరాజుకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటాం రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ సూచించారు. వైయస్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీదిరి అప్పలరాజుకు భరోసా ఇచ్చారు. అప్పలరాజు కుటుంబ సభ్యులతోనూ వైయస్ జగన్ మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు కుటుంబ సభ్యులు వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.