మామిడి రైతులకు కూట‌మి స‌ర్కార్ మోసం

చిత్తూరు:  మామిడి రైతుల‌ను గ‌త ఐదు నెల‌లుగా కూట‌మి ప్ర‌భుత్వం మోసం చేస్తూనే ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బంగారుపాళ్యం వ‌చ్చి రైతుల ప‌క్షాన పోరాటం చేయ‌డంతో కూట‌మిప్ర‌భుత్వం దిగి వ‌చ్చి మామిడి రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పిస్తామ‌ని మాటిచ్చింద‌న్నారు. ఫ్యాక్ట‌రీ నుంచి కిలో మామిడి 8 రూపాయలు, మ‌రో 4 రూపాయలు ప్ర‌భుత్వం సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింద‌న్నారు. ప్రభుత్వం తరపున ఇస్తున్న  సబ్సిడీ మాత్రమే 40,795 మంది రైతులు 46వేల మెట్రిక్ టన్నులకు రూ.180 కోట్లు జమ చేసింద‌న్నారు. ఇది రైతులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం విజయమ‌న్నారు. ఫ్యాక్టరీలు యాజమాన్యాలు నుంచి రావాల్సిన రూ. 370 కోట్లు రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత ప్ర‌భుత్వానిదే అన్నారు. ఇందుకోసం రైతుల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొన‌సాగిస్తుంద‌ని రోజా పేర్కొన్నారు. 

Back to Top