ప్రజారాజ్యం ఎందుకు మూసేశాడో నీ అన్న చిరంజీవినే అడుగు.. 

మాజీమంత్రి  కురసాల కన్నబాబు  

రాజకీయాల్లో నువ్వొక సంస్కారహీనుడువి..

నీ బిల్డప్‌ కబుర్లు భరించలేకే కాపులు జనసేనను వదిలిపోతున్నారు

పిఠాపురంలోనూ నీ ఓటమి ఖాయమే..

పవన్‌కళ్యాణ్‌పై మాజీమంత్రి  కురసాల కన్నబాబు ఫైర్‌

కాకినాడ‌: ప్రజారాజ్యం ఎందుకు మూసేశాడో నీ అన్న చిరంజీవినే అడుగు.. అంటూ వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి  కురసాల కన్నబాబు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సూచించారు. ప‌వ‌న్ నామీద కూడా ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నాడు. చిరంజీవి  కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పవన్‌కళ్యాణ్‌పై నేను కొంత సంయమనం పాటిస్తాను. చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీలో నేను కీలకంగా పనిచేసిన వ్యక్తిని. అలాంటిది, నన్నేదో ఆయన పార్టీలో పోషించినట్లు పవన్‌కళ్యాణ్‌ బిల్డప్‌ ఇస్తూ మాట్లాడుతాడా..? సామాన్య జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన వ్యక్తిని నేను.. ఆయనకు మాదిరిగా ఏమాత్రం కష్టపడకుండా జాక్‌పాట్‌లు కొట్టుకుంటూ ఎదగలేదన్నారు. కాకినాడ క్యాంప్‌ కార్యాలయంలో మాజీమంత్రి  కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

*జగన్‌ గారి మేనిఫెస్టోపై చెక్కుచెదరని నమ్మకంః*
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు నిన్ననే 2024 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. చెప్పాడంటే చేస్తాడంతే.. అనే నమ్మకాన్ని 2019 మేనిఫెస్టో ఆయన అమలు చేసి నిరూపించారు. మేనిఫెస్టో హామీల్లో 99.4 శాతం అమలు చేసి ప్రజలకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రిగా జగన్‌ గారు చరిత్రలో నిలిచిపోయారు. ఆ నమ్మకంతోనే మరోమారు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఆయన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రకటించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తం చేయడాన్ని చూస్తోన్నాం. 

*విప్లవాత్మక పరిపాలనా విధానాలపై జనాదరణః*
జగన్‌ గారి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైంది. విప్లవాత్మకమైన పరిపాలన విధానాలకు మరో మారు మద్ధతు పలకాలనే ఆవశ్యకతను ప్రజలకు గుర్తుచేస్తోంది. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యాలయాలు బాగుచేయడం.. పేద కుటుంబాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య, ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందరికీ అందుబాటులోకి తేవడం, విలేజ్‌ క్లినిక్‌ల కాన్సెఫ్ట్‌తో పాటు వ్యవసాయం చేసే రైతులకు రైతుభరోసా ఇవ్వన్నీ క్షేత్రస్థాయిలో సత్ఫలితాలిచ్చాయి. కనుక, మళ్లీ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ పరిపాలనా సంస్కరణలను తెచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనప్రమాణాలను మెరుగుపరిచిన ముఖ్యమంత్రిగా జగన్‌ గారిని ప్రజలు ఆదరిస్తున్నారు.

*మేనిఫెస్టోలో కనిపిస్తోన్న వాస్తవిక ధృక్పథంః*
జగన్‌ గారు ఒక హామిని ఇచ్చారంటే దాన్ని నెరవేరుస్తారనే నమ్మకం ఉండబట్టే ఇస్తారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక వనరులు, బడ్జెట్‌ పరిస్థితిపై అంచనాలతో ఒక వాస్తవిక ధృక్పథంతో ఆయన మేనిఫెస్టోపై కసరత్తు చేశారు. కాబట్టే.. ఈరోజు ఆయన కొత్త మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు మాదిరిగా మోసాలు, దగాలు ఆశ్రయించి.. మేనిఫెస్టోను మాయం చేసే నైజం మా నాయకుడుకు లేదు. ఉండదు. గతంలో సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు తదితర  అంశాలు ప్రజల మన్ననలను చూరగొన్నారు. వీటితో పాటు ఈసారి వాహనమిత్ర ఆటో, టాక్సీ డ్రైవర్లతో పాటు ట్రక్కు డ్రైవర్లకూ అందిస్తామనడం, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ ప్రభుత్వ పథకాల సంక్షేమాన్ని వర్తింపజేయడం, అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలకు మరో రూ.2 వేలు కలిపి రూ.17 వేలు చేయడం, వృద్ధులకు పింఛన్‌కానుక రూ.3500లు ఇలా పాత పథకాలతో పాటు కొత్త కార్యక్రమాలపై జగన్‌ గారు మంచి ఆలోచన చేయడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. 

*కాకినాడలో ఫ్యాన్‌ గాలిదే హవాః*
ఇక, కాకినాడ జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే.. అన్ని నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గా లు, పార్లమెంట్‌ స్ధానాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోబోతున్నాం. మేం వెళ్లిన ప్రతీచోటా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో పేదల పట్ల మనుసున్న ముఖ్యమంత్రిగా జగన్‌ గారు అనేక మంచి పనులు చేశారని.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటామని అంటున్నారు. 

*సంస్కార హీనుడు పవన్‌కళ్యాణ్ః*
చంద్రబాబు కోసమే రాజకీయాలు చే స్తున్న పవన్‌కళ్యాణ్‌ నిన్న కాకినాడ రూరల్‌లో ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడాడు. యథావిథిగానే ఆయన మీటింగ్‌ అంటే.. గతంలో నేను ఇది చేశాను. భవిష్యత్తులో ఫలానాది చేస్తానని చెప్పేదేమీ ఉండదు. నోటికేదోస్తే అది మాట్లాడుతూ ఊగిపోవడం ఆయనకు అలవాటైన వైనం. సంస్కారం అనేది ఈ పవన్‌కళ్యాణ్‌క లేదు. ఇక అబ్బదు అనే విషయాన్ని చాలాసార్లు చూశాం. కేవలం, జగన్‌ గారిని, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను, ప్రభుత్వాన్ని తిట్టడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ప్రవర్తిస్తున్నాడు. 

*పవన్‌కళ్యాణ్‌.. ఏంటి నీ బిల్డప్‌ కబుర్లు..?ః*
నామీద కూడా ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నాడు. చిరంజీవి గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పవన్‌కళ్యాణ్‌పై నేను కొంత సంయమనం పాటిస్తాను. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలో నేను కీలకంగా పనిచేసిన వ్యక్తిని. అలాంటిది, నన్నేదో ఆయన పార్టీలో పోషించినట్లు పవన్‌కళ్యాణ్‌ బిల్డప్‌ ఇస్తూ మాట్లాడుతాడా..? సామాన్య జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన వ్యక్తిని నేను.. ఆయనకు మాదిరిగా ఏమాత్రం కష్టపడకుండా జాక్‌పాట్‌లు కొట్టుకుంటూ ఎదగలేదు. ఈనాడు సంస్థలో జర్నలిస్టుగా పనిచేసేటప్పుడే 1995 నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కడుతున్న వ్యక్తిని నేను. చిరంజీవి గారి ఆహ్వానం మేరకు ఆయన టీమ్‌లో పనిచేయడానికి వెళ్లానే తప్ప.. వాళ్లకు టచప్‌బాయ్‌గానో.. గొడుగు పట్టుకోవడానికి వెళ్లినోడిని కాదు నేను. ఆరోజుకు నువ్వు కూడా చిరంజీవి గారి తమ్ముడివి. ఆరోజుకు నువ్వు కూడా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తివే. నేను ప్రజారాజ్యంలో పనిచేసిన వ్యక్తినే కానీ.. నీకూనాకూ ఎక్కడ సంబంధంలేదే..? మరి, ఏంటి నీ బిల్డప్‌..? 

*నీ అహంకారానికి బుద్ధిచెబుతా..ః*
మెగాస్టార్‌ చిరంజీవి గారి తమ్ముడివైనంత మాత్రాన నువ్వు బెంజి కారులో తిరిగినంత మాత్రాన నీ కళ్లముందు కనిపించే వాళ్లంతా తక్కువా..? నువ్వు ఎక్కువా.? అనే భావన ఎందుకొస్తుంది..? అతని మాటతీరు, ప్రవర్తన చూస్తే.. తనకు తాను గొప్పోడిగా భావిస్తూ.. ఎదుటి వ్యక్తులు తనకన్నా చిన్నవాళ్లు అనుకునే అహంకారంతో మాట్లాడటం అలవాటైంది. నువ్వు చదివింది టెన్త్‌క్లాస్‌ మాత్రమేనని గుర్తుంచుకుంటే మంచిది. నీ చదువుకు నువ్వు మాట్లాడే భాషకు ఏమైనా అర్ధముందా..? ఒక జర్నలిస్టు అంచెలంచెలుగా కష్టపడి రాజకీయాల్లోనూ తనకంటూ ముద్ర వేసుకున్న నన్ను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావా..? నీ అహంకారానికి త్వరలో దేవుడు బుద్ధిచెప్పాలని కోరుకుంటున్నాడు. 

*పిఠాపురంలో ఎవరి భిక్ష కోసం పాకులాడుతున్నావ్‌..?ః*
చిరంజీవి గారు నాకు రాజకీయంగా అశీస్సులందజేశారు. ఆయన 294 మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే గెలిచిన వారిలో నేనొకడిని. ఆయన వల్లనే నేను ఎమ్మెల్యే అయ్యానని గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఆశీస్సులతో రాజMీ యాల్లో ఎదిగానని చెబుతాను. అంతేగానీ.. నువ్వంటున్న భిక్షతో మాత్రం కాదు. మరి, నువ్వు సినిమా నటుడుగా ఉన్నావంటే అదెవరిచ్చిన భిక్షా.? నీ అన్నయ్య చిరంజీవి గారి భిక్ష కాదా..? మరి, ఏ రోజైనా నేను సినిమా ఇండస్ట్రీలో పైకెదగడానికి కారణం నా అన్నయ్య చిరంజీవి గారని చెప్పావా..? అంతెందుకు, నువ్వొక పవర్‌స్టార్‌నని .. అశేష అభిమానుల ఫాలోయింగ్‌ ఉన్న నటుడిగా బిల్డప్‌ ఇస్తావుగా..? మరి, పిఠాపురం వెళ్లి టీడీపీ నేత వర్మ గారిని అక్షింతలు వేయమని.. కేకు తినిపించాలంటూ ఎందుకు బతిమాలుతున్నావు..? ఎవరి భిక్షతో అక్కడ ఎమ్మెల్యేగా గెలుద్దామని.? ఎందుకంత పాకులాడుతున్నావో సమాధానం చెప్పు. 

*వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో నీ మిత్రుత్వమేంటి..?*
చంద్రబాబుతో కొన్నాళ్లు కలిసి ఉంటావు. ఆ తర్వాత విడిపోతావు. నన్ను చంపబోతున్నారంటావు..? మా అమ్మను బూతులతో తిట్టారని ఆవేశం చూపిస్తావు. మళ్లీ ఇవాల్టికి ఎన్నికలు రాగానే నిన్ను రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చంకనే ఎక్కి కూర్చొంటావు. జనసేన పార్టీలో నిన్ను నమ్మేదెవరు..? ఇవాళ నేను మంత్రిగా పనిచేసినందుకు, కాకినాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాకంటూ ప్రత్యేక స్థానం ఉన్నందుకు నేను జగన్‌ గారికి రుణ పడి ఉంటాను. ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను. అలాగే, రాజకీయ ఆశీస్సులందజేసిన చిరంజీవి గారి గురించి మంచిగానే చెప్పుకుంటాను. ఆయన తమ్ముడైనంత మాత్రానా నిన్నెప్పటికీ గౌరవించను. రాజకీయాల్లో విలువల్లేని వ్యక్తివి నువ్వు. కిందటి ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీచేసినప్పుడు నా వల్లనే ఓడిపోయావా..? ఆ రెండు చోట్ల నిన్ను ఓడగొట్టింది చంద్రబాబు అని నీకు తెలియదా..? అనవసరంగా మమ్మల్నెందుకు ఆడిపోసుకుం టావు..? 

*కాపు నాయకులను నువ్వేం కాపాడావు..?ః*
జనసేన పార్టీ పెట్టావు. కులాలను నాకు అంటకట్టొద్దంటూనే కాపు నాయకులు నన్ను పట్టించుకోవాలన్నావు. గాజువాక, భీమవరంలో సొంత కాపు కులస్తులే నిన్ను ఓడించారని ఏడ్చావు. మరి, ఈ ఎన్నికల్లో నువ్వు చేసిందేంటి.? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నీ బిల్డప్‌ను కారణంగా చూపి చంద్రబాబుతో కాపురం చెడకుండా చూసుకున్నావు. పొత్తు నేపథ్యంలో 24 సీట్లు తీసుకుని .. దానికి గాయత్రీమంత్రం అంటూ ఒక కథ అల్లావు. పోన్లే.. ఆ 24లో కాపు నేతలకు రాజకీయ అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. తీరా.. 21 సీట్లతో ముడుచుకుంటానని.. అందులోనూ చంద్రబాబు చెప్పిన వారికే సీట్లు ఇవ్వగా మిగిలిన వాటిని జనసేన అభ్యర్థులకిచ్చావు. పితాని బాలకృష్ణ, పోతిన మహేష్‌ వంటి జనసేనలో కీలకంగా పనిచేసిన వారిని దూరం చేసుకుని.. చంద్రబాబు వలలో పడి గిలగిల కొట్టుకుంటూ.. ఆ ఫ్రస్టేషన్‌ మామీద చూపిస్తే ఎలా కుదురుతుంది..? 

*ప్రజారాజ్యం విలీనంపై చిరంజీవినే ప్రశ్నించు..?ః*
చంద్రబాబు వలలో చిక్కి పవన్‌కళ్యాణ్‌ బలైపోవడం ఖాయమని ఇవాళ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ చెబుతారు. నేను చెబితే చిరంజీవి గారు తన పార్టీని విలీనం చేశారని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. నిజంగా, ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమేంటనేది స్వయాన అన్న చిరంజీవి గారినే అడగొచ్చు కదా..? అంటే, మీ లోపాల్ని ఇతరుల మీద రుద్ది ప్రచారం చేసుకుంటారా..? అలా చేసి ఏం సాధిస్తారు..? 

*సినిమా నటుల చర్చకూ నాకేంటి సంబంధం..?ః*
చిరంజీవి గారు, ప్రభాష్, మహేష్‌బాబు తదితరులు ముఖ్యమంత్రి జగన్‌ గారిని కలవడానికి వెళ్లినప్పుడు సీఎంఓలో ఏదో చర్చ జరిగిందంట. అక్కడ ఫోటోలు, వీడియోలు లీక్‌ అయ్యాయంట.. అసలు, ఆ కార్యక్రమానికీ కన్నబాబుకు ఏమైనా సంబంధం ఉందా..? ఇతను మాత్రం కన్నబాబుకు సిగ్గుందా..? అని ఊగిపోతున్నాడు. వాళ్లకు నేనేమైనా అప్పాయింట్‌ ఇప్పించి కలిపించానా..? ఆ కార్యక్రమాన్ని నేను ఆర్గనైజ్‌ చేశానా..? నాకెలాంటి సంబంధం లేకుండా ఆయన నన్నెందుకు టార్గెట్‌ చేసి మాట్లాడాడు..? సినిమా టిక్కెట్ల వ్యవహారం నటులకు సంబంధం లేదన్న నువ్వు.. నిర్మాతల మండలినే సీఎం దగ్గరకు పంపాలి గదా.?? మీరెందుకు వెళ్లారంటూ ఆయన అన్ననే ప్రశ్నించాలి గదా..? చిరంజీవికి అవమానం జరిగిందని ఆయనే ఎక్కడా చెప్పలేదు. పోనీ, ఆయనతో పాటు వచ్చిన తోటి నటులైనా ఎక్కడైనా చెప్పారా..? ఆయనకు అవమానం జరిగిందని తెలిసి నువ్వేం చేశావో చెప్పు. 

 *నీ ఆవేశం, ఊపుడు ప్రసంగాలపై డౌటొస్తుందిః*
నేను, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పడవల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నామని అంటున్నాడు. ఈ మాట చెప్పుకుని ప్రజలు నవ్వుకుంటున్నారు. నీ ఊపుడు, నీ ఆవేశపు మాటల్ని చూసి ఆ గంజాయి, డ్రగ్స్‌లాంటివి నువ్వేమైనా వాడుతున్నావో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా..? నువ్వు నటుడివైనంత మాత్రాన అంత స్పృహ కోల్పోయి ప్రవర్తిస్తావా..? నీ వేషాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు.  నేను సముద్రం ఇసుకను కూడా దోపిడీ చేస్తున్నానంటాడు. సముద్రం ఇసుక దేనికి వాడతారో.. 2 లక్షల పుస్తకాలు చదివిన నీ మేధావితనానికి తెలియదా..? 

*జగన్‌ గారి పట్ల కాపులకు విశ్వాసం ఉందిః*
కాపు కులస్తులను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తితో నువ్వు చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి నువ్వు సిగ్గుపడాలి. కాపులను కాపు కాస్తున్న ఒకే వ్యక్తి జగన్‌ గారు మాత్రమే. కాపు సోదరులపై కేసులు ఎత్తివేసింది కూడా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే. ఈబీసీ నేస్తం ద్వారా కాపులకు మేలు చేసిన ప్రభుత్వం కూడా మాదేనని మేం గర్వంగా చెప్పుకుంటాం. గతంలో 30 మంది కాపులను ఎమ్మెల్యేలను చేయడమే గాకుండా ఐదుగురు కాపులను మంత్రులుగా చేసిన ఘనత జగన్‌ గారికే దక్కుతోంది. జగన్‌ అంటే నమ్మకం, విశ్వాసం ఉండబట్టే.. నువ్వు జనసేనలో మోసం చేస్తే కాపులంతా వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారని తెలుసుకో..  

Back to Top